కౌన్సిల్ అజెండాపై నగర మేయర్ సమీక్ష
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:41 AM
కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కార్పొరేషన్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న జరిగే సమావేశంలో అజెండా, అడిషనల్ ప్రతిపాదనలను చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్ సిటీప్లానర్ ప్రసాద్, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్‌ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సెక్రటరీ వసంతలక్ష్మి, ఇంజనీర్లు పి.సత్యకుమారి, పి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటే శ్వరరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్య నాయక్ పాల్గొన్నారు