Share News

శ్రీకాళహస్తి కాలనీకి తాగునీరివ్వాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:00 AM

పట్టణంలోని శ్రీకాళహస్తి కాలనీ ఏర్పాటై ఇరవై ఏళ్లైనా ఇప్పటికీ కాలనీకి తాగునీరు ఇవ్వలేకపోయారని ఇది సిగ్గుచేటని, వెంటనే కాలనీకి తాగునీరు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి డిమాండ్‌ చేశారు.

శ్రీకాళహస్తి కాలనీకి తాగునీరివ్వాలి
సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న కాలనీవాసులు, సీపీఎం నాయకులు

గుడివాడ రూరల్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీకాళహస్తి కాలనీ ఏర్పాటై ఇరవై ఏళ్లైనా ఇప్పటికీ కాలనీకి తాగునీరు ఇవ్వలేకపోయారని ఇది సిగ్గుచేటని, వెంటనే కాలనీకి తాగునీరు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం శ్రీకాళహస్తి కాలనీ సచివాలయం దగ్గర స్థానికులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన తెలిపి, కార్యదర్శి కోటయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో అరకొరగా నీళ్లు పట్టి పబ్బం గడుపుతున్నారని ఆర్సీపీ రెడ్డి అన్నారు. పైపులైన్లు వేసిన తర్వాత కూడా నీటి సరఫరా జరగడం లేదని, దీని కారణంగా ప్రజలు వేసవిలో తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని ఆయ న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులు ఆర్‌.కొండ, ఎల్‌.సురేంద్ర, స్థానికులు ఎం. మంగమ్మ, బి.లక్ష్మి, ఎం.లోకేశ్వరి, భవాని, రంగారావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎస్‌.క్రీస్తురా జు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:00 AM