Physics Wallah: ఫిజిక్స్ వాలా IPO ద్వారా ఎందుకంత మొత్తాన్ని సేకరిస్తోంది..
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:03 PM
Physics Wallah IPO: స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావడం ఈ కంపెనీకి ఒక పెద్ద అడుగైతే, ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన మొదటి భారతీయ విద్యా సాంకేతిక సంస్థ కావడం మరో విశేషం.

ముంబై, మార్చి 22: భారతదేశంలోని అగ్రశ్రేణి ఎడ్యుటెక్ సంస్థ ఫిజిక్స్ వాలా(Physics Wallah). దేశంలోని విద్యా సాంకేతిక సంస్థల్లో మొదటిదైన ఈ సంస్థ ఐపీవోకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా స్టూడెంట్స్, పేరెంట్స్ కు బాగా దగ్గరైంది. ఈ సంస్థ ఇప్పుడు రూ. 4 వేల 600 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి ఉవ్విళ్లూరుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావడం ఈ కంపెనీకి ఒక పెద్ద అడుగైతే, ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన మొదటి భారతీయ విద్యా సాంకేతిక సంస్థ కావడం మరో విశేషం.
ఐపీవో (IPO) ద్వారా నిధులు సమకూర్చుకుని ఎడ్యుటెక్ రంగంలో అగ్రగామిగా ఉండాలని ఫిజిక్స్ వాలా అనుకుంటోంది. ప్రతి వారం 9,500 గంటల విద్యా కంటెంట్ ని ఉత్పత్తి చేస్తూనే, భారతదేశంలోని 18,808 పిన్ కోడ్‌లలో విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతికతతో పాటు, విద్యార్థులకు మరింత మేలైన ఫీలింగ్ కలిగేలా AI ఆధారిత టీచింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఐపీవో ద్వారా సేకరించే నిధులతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మరిన్ని దేశాలలో తమ సేవలు అందించాలని యోచిస్తోంది. వివిధ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని కోర్సులను అందించాలని కూడా యోచిస్తోంది.
కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ ద్వారా ఐపీవోకి వస్తామని సెబీని కోరిందీ సంస్థ. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్‌కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ తరహాలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంది. IPO ప్రక్రియను నిర్వహించడానికి ఫిజిక్స్ వాలా సంస్థ కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంక్, JP మోర్గాన్, ఇంకా గోల్డ్‌మన్ సాచ్స్ వంటి ప్రధాన పెట్టుబడి బ్యాంకులు(major investment banks)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Also Read:
ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి..
దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలపై నిషేధం
షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏం చేయాలి..
For More Business News and Telugu News..