Share News

IPL 2025, KKR vs RCB: ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి.. టాస్ గెలిస్తే ఏం చేయాలి..

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:00 PM

విరాట్ కోహ్లీ, క్రిష్ గేల్, డివిల్లీర్స్, డుప్లెసిస్ వంటి హార్డ్ హిట్టర్లు కూడా బెంగళూరు తరఫున బరిలోకి దిగారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెంగళూరు టీమ్ టైటిల్ సాధించలేకపోయింది. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇక, 2016 తర్వాత ప్లే-ఆఫ్స్‌‌తోనే ఆర్సీబీ కథ ముగుస్తోంది

IPL 2025, KKR vs RCB: ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి.. టాస్ గెలిస్తే ఏం చేయాలి..
KKR vs RCB

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ (RCB) ఐపీఎల్‌లో (IPL 2025) ఎన్నో ఏళ్లుగా చాలా బలమైన లైనప్‌తో ఆడుతోంది. ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ ఆ జట్టు తరఫునే ఆడుతున్నాడు. అలాగే క్రిష్ గేల్, డివిల్లీర్స్, డుప్లెసిస్ వంటి హార్డ్ హిట్టర్లు కూడా బెంగళూరు తరఫున బరిలోకి దిగారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెంగళూరు టీమ్ టైటిల్ సాధించలేకపోయింది. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇక, 2016 తర్వాత ప్లే-ఆఫ్స్‌‌తోనే ఆర్సీబీ కథ ముగుస్తోంది.(RCB vs KKR)


మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఐపీఎల్‌లో తన హవా కొనసాగిస్తోంది. మూడు సార్లు (2012, 2014, 2024) ఐపీఎల్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. ఇంతకు ముందు సీజన్లలో బాగా తడబడినప్పటికీ 2024లో అద్బుతంగా కమ్‌బ్యాక్ చేసింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తన స్వంత మైదానం అయిన ఈడెన్ గార్డెన్స్‌లో తలపడబోతోంది.


ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరిగాయి. వాటిల్లో కేకేఆర్ 20 సార్లు, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించాయి. ఇక, ఈడెన్ గార్డెన్స్‌లోఈ రెండు జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. వాటిల్లో కేకేఆర్ 8 సార్లు గెలుపొందగా, ఆర్సీబీ నాలుగు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక, ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఇప్పటివరకు మొత్తం 88 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 52 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 36 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించే పిచ్. గత 15 మ్యాచ్‌ల్లో చూసుకుంటే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు గెలిచింది. సెకెండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు గెలుపొందింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే కాస్త ఉపయోగం ఉండేలా కనబడుతోంది.

ఇవి కూడా చదవండి..

ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా

RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 04:30 PM