కొండాలమ్మ ఆలయ హుండీల ఆదాయం రూ.37.89 లక్షలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:58 AM
వేమవరం కొండాలమ్మ ఆలయం, అమ్మవారి దేవస్థాన దత్తత ఆలయం రెడ్డిపాలెం ఆంజనేయస్వామి ఆలయాల హుండీలను గురువారం తెరిచి కానుకలు లెక్కించారు.

గుడ్లవల్లేరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వేమవరం కొండాలమ్మ ఆలయం, అమ్మవారి దేవస్థాన దత్తత ఆలయం రెడ్డిపాలెం ఆంజనేయస్వామి ఆలయాల హుండీలను గురువారం తెరిచి కానుకలు లెక్కించారు. 75 రోజులకు భక్తులు కొండాలమ్మకు రూ.37.89 లక్షలు సమర్పించారని ఆలయ ఈవో ఎ. కొండలరావు తెలిపారు. రెడ్డిపాలెం అభయాంజనేయస్వామికి రూ.68,965 సమర్పించారని ఆయన తెలిపారు. మచిలీపట్నం రాబర్ట్‌సన్‌పేట రంగనాయక స్వామి ఆలయ ఈవో ఎం.సత్యప్రసాద్ పర్యవేక్షణలో, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ అధికారు లు, ఆలయ సిబ్బంది సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించామని ఈవో కొండలరావు తెలిపారు.