Share News

విచ్చలవిడిగా బెల్టు షాపులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:16 AM

మొవ్వ మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి.

విచ్చలవిడిగా బెల్టు షాపులు

పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి-కూచిపూడి)

మొవ్వ మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయి. గుడి, బడి, నివాస ప్రాంతాలనే తేడా లేకుండా బెల్టుషాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం విక్రయా లు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్‌, పోలీసు శాఖ కనుసన్నల్లోనే బెల్టుషాపుల హవా కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కూచిపూడి, మొవ్వ, పెదపూడి, నిడుమోలు, కాజ, కోసూరు, చినముత్తేవి, పెద్దముత్తేవి, అయ్యంకి గ్రామాలతోపాటు మండలంలోని 21 పంచాయతీల్లోనూ బె ల్టుషాపుల ద్వారా రేయింబవళ్లు విక్రయాలు సా గుతున్నా నియంత్రించాల్సిన అధికారులు నామమాత్రపు దాడులైనా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మండలంలో నిడుమోలు, కూచిపూ డి, మొవ్వ, కాజ గ్రామాల్లో ప్రభుత్వ అనుమతి పొందిన నాలుగు మద్యం దుకాణాలు ఉండగా, వాటికి సమాంతరంగా బెల్టుషాపుల ద్వారా మ ద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:16 AM