అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లు సీజ్
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:03 AM
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై, కెవిజివి సత్యనారాయణ తెలిపారు.

తిరువూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై, కెవిజివి సత్యనారాయణ తెలిపారు. లక్ష్మీపురం నుంచి తెలంగాణ ప్రాంతం మొద్దులగూడెం వైపు వెళుతున్న రెండు లారీలను, మునుకుళ్ల వైపు వెళుతున్న రెండు ఇసుక లారీలను పట్టుకు న్నామన్నారు. మూడు లారీలను స్టేషన్‌కు తరలించామని, ఒక టిప్పర్ టైర్ పగలడంతో అక్కడే ఉంచామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తోలకాలు చేస్తే సీజ్ చెయ్యడంతో పాటుగా, సంబందిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.