నవ్వు‘తారు’
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:28 PM
టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తోంది. అయితే కొందరు కాంట్రాక్టర్ల వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. హొళగుంద నుంచి హాన్నూరు క్యాంప్‌కు 5.2 కిలో మీటర్ల రహదారికి రూ. 4.70 కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్డు 15 రోజులకే రాళ్లు తేలింది.

15 రోజులకే కంకర తేలి గుంతలు పడిన బీటీ రోడ్డు
హొళగుంద-హొన్నూరు క్యాంప్ రహదారి దుస్థితి
హోళగుంద, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తోంది. అయితే కొందరు కాంట్రాక్టర్ల వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. హొళగుంద నుంచి హాన్నూరు క్యాంప్‌కు 5.2 కిలో మీటర్ల రహదారికి రూ. 4.70 కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్డు 15 రోజులకే రాళ్లు తేలింది. కంకర రాళ్లపై చిప్స్ వేసి వాటిపై 25ఎంఎం క్వాలిటీతో తారు వేయాల్సి ఉండగా, నాసిరకంగా వేయడంతో ఆరు నెలల్లోనే రోడ్డు మొత్తం గుంతలు పడడం ఖాయమని స్థానికులు వాపోతున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పీఆర్ ఏఈ యమునప్పను వివరణ కోరగా విచారణ చేస్తామని, రహదారి నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.