Share News

ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:23 AM

నగర శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం పన్నుల చెల్లింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన మేనేజర్‌ చిన్న రాముడు సూచించారు.

ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
ప్రత్యేక కౌంటర్‌ను పరిశీలిస్తున్న మేనేజర్‌ చిన్నరాముడు

కర్నూలు న్యూసిటీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): నగర శివారు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం పన్నుల చెల్లింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన మేనేజర్‌ చిన్న రాముడు సూచించారు. మంగళవారం ఆయన మద్దూర్‌నగర్‌ 62వ సచివాలయంలోని ప్రత్యేక కౌంటరును పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని దూరప్రాంతాల ప్రజలు పన్నులు చెల్లించేందుకు వ్యవప్రయాసాలతో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మద్దూర్‌నగర్‌తోపాటు కల్లూరు 85వ సచివాలయం, బాలా జీనగర్‌ 104 సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగు స్తుందని, ప్రజలు సత్వరమే పన్ను లు చెల్లించి నగరాభివృద్ధి తోడ్పా టు అందించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 26 , 2025 | 12:24 AM