Share News

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:12 AM

జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు రౌడీషీటర్లకు, నేరచరిత్రగలవారికి, చెడునడవడిక కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న పోలీసులు

ప్రజల శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

కర్నూలు క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్‌ఐలు రౌడీషీటర్లకు, నేరచరిత్రగలవారికి, చెడునడవడిక కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు 584 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సబ్‌ డివిజన్ల వారిగా కర్నూలులో 199 మందికి, ఆదోనిలో 87, పత్తికొండలో 112, ఎమ్మిగనూరులో 186 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:12 AM