ఈదురుగాలులతో నష్టం
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:49 PM
పాణ్యంలో మంగళవారం వీచిన భారీ ఈదురుగాలులకు వందలాది ఎకరాల పంటలు నేలవాలాయి. దాదాపు 50 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నట్లు రైతులు వాపోయారు.

దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలు
పాణ్యం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పాణ్యంలో మంగళవారం వీచిన భారీ ఈదురుగాలులకు వందలాది ఎకరాల పంటలు నేలవాలాయి. దాదాపు 50 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నట్లు రైతులు వాపోయారు. 30 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలాయి. అకస్మాత్తుగా వీచిన గాలులకు అరటి పంటలు పూర్తిగా పడిపోవడంతో ఎకరాకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.