లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: సీఐటీయూ
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:20 AM
కార్మిక హక్కు లకు నష్టం కలిగించే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ప్రతి కార్మికుడు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు కోరారు.

ఎమ్మిగనూరు టౌన, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కార్మిక హక్కు లకు నష్టం కలిగించే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ప్రతి కార్మికుడు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో సీఐటీయూ అధ్యక్షులు గోవిందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నేడు బీజేపీ ప్రభు త్వం ఏకపక్షంగా వ్యవహరించి నాలుగు లేబర్ కోడ్‌లుగా చేసింద న్నారు. కనీస వేతన హక్కు చట్టం, గ్రాట్యుటి, పెన్షన, పనిభద్రత, సెలవులు ఇతర సౌకర్యాలు లేకుండా చట్టాల వల్ల కార్మికుల హక్కులు పూర్తిగా హరించివేసిందన్నారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు ఉద్యమిం చాలని సీఐటీయూ నాయకులు కోరారు. కార్యక్రమంలో రాముడు, ప్రవీణ్ కుమార్, రాజు, వరలక్ష్మి, విజయమ్మ, గోవర్థనమ్మ పాల్గొన్నారు.