Share News

నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:25 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహారించారు.

నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
నవరత్నాల రథాన్ని లాగుతున్న భక్తులు

మంత్రాలయం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహారించారు. గురువారం త్రయోదశి శుభ దినాన్ని పురస్కరించుకుని రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు నిర్వహించారు. నవరత్నాల బంగారు రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.

ఫ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. గురువారం దక్షిణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, మధ్వమార్గ్‌ కారిడార్‌, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది.

Updated Date - Mar 28 , 2025 | 12:25 AM