Share News

జొన్న రైతులను ఆదుకోండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:57 PM

: జొన్నలను తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జొన్న రైతులను ఆదుకోండి
జేసీకి వినతిపత్రం అందజేస్తున్న రైతుసంఘం నాయకులు

రాయలసీమ సాగునీటి సాధన సమితి

నంద్యాల ఎడ్యుకేషన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జొన్నలను తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు బొజ్జాదశరధరామిరెడ్డి మాట్లాడుతూ జొన్నలు బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వ మద్ధతు ధర కంటే తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం మూడు వారాల నుంచి కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ నేటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల విజ్ఞప్తికి జేసీ విష్ణుచరణ్‌ స్పందించారు. మద్దతు ధరకు జొన్న లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే వారం నుంచి జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతవరకు అకాల వర్షాల నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరినా థరెడ్డి, మురళీనాథ్‌ రెడ్డి, దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:57 PM