రంజాన నెల పవిత్రమైనది: మంత్రి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:28 AM
రంజాన పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమెందని మంత్రి టీజీ భరత అన్నారు.

కర్నూలు అర్బన, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రంజాన పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమెందని మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం నగరంలోని గడియారం ఆస్పత్రి సమీపంలోని జామీయా మసీదులో రోజా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింప జేశారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనలు, ఇప్తార్‌లో ఆయన పాల్గొన్నారు. ముస్లింలంతా రంజాన పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు.