ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:06 AM
ప్రజా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. యుద్ధప్రాతికదిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలలనుంచి వచ్చిన ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి తమ సమస్యలను మంత్రికి వివరించారు. న్యాయబద్దంగా ఉన్న సమస్యలను అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలతో వచ్చే వారిపట్ల అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు శ్రద్ద చూపాలని కోరారు.