Share News

Granite Business Men: మంత్రి గొట్టిపాటితో గ్రానైట్ యజమానులు కీలక భేటీ

ABN , Publish Date - Feb 06 , 2025 | 08:33 PM

Granite Business Men: అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ప్రకాశం జిల్లా గ్రానైట్ యజమానులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారి సమస్యలను మంత్రి దృష్టికి వారు తీసుకు వెళ్లారు.

Granite Business Men: మంత్రి గొట్టిపాటితో గ్రానైట్ యజమానులు కీలక భేటీ
AP Minister Gottipati Ravi kumar

అమరావతి, ఫిబ్రవరి 06: గ్రానైట్ రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆ ఆసోసియేషన్ సభ్యులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలోని మంత్రి గొట్టిపాటి కార్యాలయంలో ఆయనతో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ రంగంలో నెలకొన్న సమస్యలను మంత్రి గొట్టిపాటి దృష్టికి వారు తీసుకెళ్లారు. కూలీల కొర‌త‌తోపాటు గ్రానైట్ ఎగుమతులు సైతం త‌గ్గాయని తెలిపారు.

అలాగే గిట్టుబాటు ధ‌ర సైతం దక్కడం లేదంటూ మంత్రి ఎదుట వారు వాపోయారు. ఈ నేపథ్యంలో అంద‌రికీ ఉప‌యుక్తంగా మ‌రింత పార‌ద‌ర్శకంగా పారిశ్రామిక విధానం అమ‌లు చేయాల‌ని మంత్రి గొట్టిపాటిని ఈ సందర్భంగా వ్యాపారులు కోరారు. అలాగే గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి విద్యుత్‌తోపాటు వివిధ రకాల రాయితీలు కల్పించాలని మంత్రి గొట్టిపాటికి గ్రానైట్ వ్యాపారులు, యజమానులు వివరించారు. పరిశ్రమకు సంబంధించి విద్యుత్‌తో పాటు వివిధ ర‌కాల పారిశ్రామిక రాయితీలను క‌ల్పించాల‌ని మంత్రికి వారు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం.. గ్రానైట్ పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. గ్రానైట్ ఓనర్లు.. తమ సమస్యలలో ముఖ్యంగా లీజు రెన్యువల్స్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించిన సమయంలో క్వారీల్లో అ శాస్త్రీయంగా కొలతలు తీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. దీంతో భారీ పెనాల్టీ వల్ల రెన్యువల్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వివిధ రకాల పేర్లతో పన్నులు విధిస్తున్నారంటూ గ్రానైట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో 90 శాతం గ్రానైట్‌ ఎగుమతి ఆగి పోయిందంటూ వారు గతంలోనే వాపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని యజమానులు ప్రభుత్వానికి ఇప్పటికే విజ్జప్తి చేసిన విషయం విధితమే.

Also Read: ఢిల్లీ ఫలితాలపై యాక్సిస్ మై ఇండియా అంచనా ఇదే.. సునామీ సృష్టించనున్న ఆ పార్టీ

Also Read: ఢిల్లీలో మేము ఓడిపోతాం.. గెలుపు ఆపార్టీదే.. తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత

Also Read: క్రీడాకారులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 08:33 PM