600 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:52 PM
బేస్తవారపేట జంక్షన్‌లో 600బస్తాల రేషన్‌బియ్యంతో ఉన్న లారీని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పట్టుకున్నారు. లారీ ద్వారా బియ్యం తరలిపోతున్నట్లు తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు నేదురుమల్లి జయరాజ్ సబ్ కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్
కంభం గోడౌన్‌కు బియ్యం తరలింపు
బేస్తవారపేట,ఏప్రిల్(ఆంధ్రజ్యోతి): బేస్తవారపేట జంక్షన్‌లో 600బస్తాల రేషన్‌బియ్యంతో ఉన్న లారీని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పట్టుకున్నారు. లారీ ద్వారా బియ్యం తరలిపోతున్నట్లు తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు నేదురుమల్లి జయరాజ్ సబ్ కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెను వెంటనే ఆయన బేస్తవారపేట చేరుకొని లారీని, బియ్యంను సీజ్ చేశారు. నంద్యాల ప్రాంతం నుంచి సుమారు 600 బస్తాల ప్రభుత్వ బియ్యం లారీ ద్వారా బేస్తవారపేటలోని ఒక రైస్ మిల్లులో రిసైక్లింగ్ చేసి తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. విషయం తె లుసుకున్న సబ్ కలెక్టర్ లారీని నిలిపి వివరాలు సేకరించగా నంద్యాల ప్రాంతంలో బియ్యం కొనుగోలు చేసి వాటిని బేస్తవారపేటలో రీసైక్లింగ్ చేసి పంపుతున్నామని బియ్యం తరలిస్తున్న నిర్వహకులు చెప్పారు. దీంతో అందుకు సంబంధించిన బిల్లులు సక్రమంగా లేకపోవడంతో బియ్యం,లారీని సీజ్ చేసి కంభం గోడౌన్‌కు తరలించారు.ఈ దాడిలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ వెంట ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ రామనారాయణరెడ్డి,తహసీల్దార్ జిత్రేంద,సిబ్బంది పాల్గొన్నారు.