Share News

ఉన్నత పాఠశాలకు నోచుకోని కారంచేడు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:52 PM

గత వైసీపీ పాలనలో కోట్ల విలువ చేసే భూములు, భవనాలు అప్పగించినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నత పాఠశాలకు నోచుకోలేదని కారంచేడు గ్రామస్థులు వాపోతున్నారు. రాష్ట్రంలోనే సినీ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులకు నిలయంగా ఉన్న కారంచేడులో విద్యాశాఖ ఉన్నతాఽధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత పాఠశాలకు నోచుకోని స్థితి ఏర్పడింది. గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్న చౌదరి, యార్లగడ్డ రంగనాయకులు 1956లో యార్లగడ్డ నాయడమ్మ ఎయిడెడ్‌ పాఠశాల పేరుతో చల్లపల్లి రాజాగారి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించారు. 1963లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నూతన భవనాలను ప్రారంభించారు.

ఉన్నత పాఠశాలకు నోచుకోని కారంచేడు
యార్లగడ్డ నాయడమ్మ ఓరియంటల్‌ ఉన్నత పాఠశాల (ఫైల్‌)

రూ.కోట్ల విలువ చేసే భూములు , భవనాలను అప్పగించినా

పట్టించుకోని అధికారులు

కారంచేడు (పర్చూరు), మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో కోట్ల విలువ చేసే భూములు, భవనాలు అప్పగించినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నత పాఠశాలకు నోచుకోలేదని కారంచేడు గ్రామస్థులు వాపోతున్నారు. రాష్ట్రంలోనే సినీ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులకు నిలయంగా ఉన్న కారంచేడులో విద్యాశాఖ ఉన్నతాఽధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత పాఠశాలకు నోచుకోని స్థితి ఏర్పడింది. గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్న చౌదరి, యార్లగడ్డ రంగనాయకులు 1956లో యార్లగడ్డ నాయడమ్మ ఎయిడెడ్‌ పాఠశాల పేరుతో చల్లపల్లి రాజాగారి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించారు. 1963లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నూతన భవనాలను ప్రారంభించారు. అప్పటి నుంచి వేలాది మంది ఇక్కడ విద్యను అభ్యసించారు. అవిభక్త కలవలల శస్త్ర చికిత్సకు పేరుపొందిన నాయుడమ్మతోపాటు, మంత్రిగా పనిచేయడమే కాక లోక్‌ సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించిన డాక్టర్‌ దగ్గుబాటికి విద్యాబుద్ధులు నేర్పింది ఈపాఠశాలే. ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరానికి చేర్చిన ఈపాఠశాల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. 2022లో గత వైసీపీ తెచ్చిన నూతన విధానానికి అనుగుణంగా పాఠశాల కరస్పాండెంట్‌ రఘబాబు ఇతర కమిటీ సభ్యులు కోట్లాది రూపాయల విలువచేసే ఎకరం భూమిలో నిర్మించిన 12 గదుల భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనపరిచారు. నిబంధనల మేరకు ప్రభుత్వం పాఠశాల నిర్వహించాల్సి ఉండగా యూడైస్‌ కోడ్‌ను పిల్లలు లేరన్న నెపంతో రద్దు చేశారని కమిటీ ప్రతినిఽధులు చెప్తున్నారు. తిరిగి పాఠశాలను ప్రారంభించడానికి కరస్పాండెంట్‌ రఽఘబాబు ప్రస్తుత పాఠశాల కమిషనర్‌ దృష్టికి తీసుకుపోయిన క్రమంలో కింది స్థాయి అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఫలితం లేదని ప్రజలు అంటున్నారు. చీరాల ఉపవిద్యాశాకాధికారితోపాటు, కారంచేడు ఎంఈవోకు పాఠశాలను పూర్తిస్థాయిలో అప్పగించిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత పాఠశాల సేవలకు కారంచేడు విద్యార్థులు

Updated Date - Mar 28 , 2025 | 11:52 PM