Share News

దాడి కేసులో నిందితుడికి రిమాండ్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:21 AM

ఓ వ్యక్తిపై దాడి కేసు లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యా యమూర్తి రిమాండ్‌ విధించారు.

 దాడి కేసులో నిందితుడికి రిమాండ్‌

సింగరాయకొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ఓ వ్యక్తిపై దాడి కేసు లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యా యమూర్తి రిమాండ్‌ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల మే రకు.. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్‌కు చెందిన కుంచాల ఏడుకొండలు అక్కడి ప్రాథమిక పాఠశాలలో కోఆప్షన్‌ స భ్యుడు. ఈనెల 20వ తేదీన ఆయన స్కూల్‌కు వచ్చి సమస్యలపై హె చ్‌ఎంతో చర్చించారు. తిరిగి వెళ్తుండగా ఆయన్ను కుంచాల రవి నిలు వరించాడు. అనంతరం ఏడుకొండలును దుర్భాషలాడుతూ కర్రతో దా డి చేశాడు. దీంతో గాయాలైన ఏడుకొండలు చికిత్స నిమిత్తం కందు కూరు ఏరియా వైద్యశాలలో చేరారు. అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహేంద్ర కేసు నమోదు చేసి మంగళవారం రవిని అరె స్టు చేసి కందుకూరు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు.

Updated Date - Mar 26 , 2025 | 12:21 AM