జీబీఎస్‌తో ఉలికిపాటు
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:30 AM
గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) జిల్లా వాసులను భయపెడుతోంది. ఈ వ్యాధి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ జిల్లాలో కొద్ది రోజుల్లోనే ఏకంగా రెండు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక మహిళ మృతిచెందడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

అలసందలపల్లిలో మొన్న మహిళ మృతి
బేస్తవారపేటలో మరొకరికి లక్షణాలు
గుంటూరులో చికిత్స.. క్షేమంగా ఇంటికి చేరిక
ఆందోళన చెందుతున్న ప్రజానీకం
గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) జిల్లా వాసులను భయపెడుతోంది. ఈ వ్యాధి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ జిల్లాలో కొద్ది రోజుల్లోనే ఏకంగా రెండు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక మహిళ మృతిచెందడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ(50) గతనెల 28న అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత స్థానికంగానే వైద్యుడి వద్ద చూపించుకున్నారు. సాధారణంగా వచ్చే నొప్పులుగా భావించారు. అయితే రోజురోజుకూ అవి అధికం కావడంతో ఈనెల 2న గిద్దలూరులోని ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ ఆమెకు రోజు రోజుకూ కండరాల
కోలుకున్న బేస్తవారపేట యువకుడు
బేస్తవారపేటకు చెందిన యువకుడు ఈనెల 9న జీబీఎస్ వ్యాధి బారినపడ్డారు. విపరీతమైన నొప్పులు రావడంతో వెంటనే సమీపంలోని వైద్యశాలలో చూపించుకొని ఒంగోలులోని రిమ్స్‌కు వచ్చాడు. ఇక్కడి వైద్యులు ఆ యువకుడిని పరిశీలించి వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు మెరుగైన వైద్యం కోసం పంపించారు. అక్కడ చికిత్స పొంది కోలుకున్నాడు. ఇప్పుడు స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ యువకుడితో డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జీబీఎస్ ఎప్పటి నుంచో ఉందని, సకాలంలో గుర్తిస్తే ఎలాంటి ప్రమాదకరం కాదని చెప్తున్నా ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది. సోమవారం డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు అలసం దలపల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. మృతిచెందిన కమలమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు.