వడ్డీలేని రుణాలతో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:06 PM
పొ దుపు సంఘాలలో అందించే వడ్డీలేని రుణాలను అందింపుచ్చుకుని ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పీఎం అజయ్ పథకం ద్వారా నియోజకవర్గంలో ని 12 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.20లక్షలు ఎస్సీ కార్పొరేషన్ వడ్డీలేని చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు.

ఎమ్మెల్యే కొండయ్య
పొదుపు సంఘాలకు
రూ.20లక్షల చెక్కుల అందజేత
చీరాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : పొ దుపు సంఘాలలో అందించే వడ్డీలేని రుణాలను అందింపుచ్చుకుని ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పీఎం అజయ్ పథకం ద్వారా నియోజకవర్గంలో ని 12 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.20లక్షలు ఎస్సీ కార్పొరేషన్ వడ్డీలేని చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈసందర్భంగా మాట్లాడుతూ పొదు పు సంఘాల ద్వారా అందించే రుణాలతో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని సంతోషంగా జీవించాలని కోరారు. అలాగే పొదుపు సంఘాల మహిళలకు రుణాలు కల్పించి సహకరించాలని సూ చించారు. కార్యక్రమంలో ఏసీ సుబ్బారావు, ఫణి, వెలుగు ఏపీఎంలు మధు, అంజిబాబు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.
పలు కుటుంబాలు టీడీపీలో చేరిక
వేటపాలెం కాంగ్రెస్ పార్టీకు చెందిన 20 కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పల్లప్రోలు శ్రీను, కొత్త నాగు ఆధ్వర్యంలో చేరిన ప్రతినిధులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొండయ్య వారికి సూచించారు.
అన్యాక్రాంతాలపై చర్యలు తీసుకోండి
మునిసిపల్ పరిధిలోని 31,32,33 వార్డుల్లో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారని, 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం ఎమ్మెల్యే కొండయ్యకు ఫిర్యాదు చేశారు. ఏళ్ల తరబడి వార్డుల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రికవరీ చేసిన వాటిల్లో నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ కోరారు.