ఖాళీగా ఉన్న ‘స్థానిక’ పదవులకు ఎన్నికలు రేపు
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:08 PM
జిల్లాలో ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడిన మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు గురువారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకున్నారు. మార్కాపురం, త్రిపురాంతకం మండలాల అధ్యక్ష పదవులతో పుల్లలచెరువు మండలంలో ఉపాధ్యక్ష, ఎర్రగొండపాలెం మండలంలో కోఆప్షన్ సభ్యుడి పదవికి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

రెండు ఎంపీపీలు, ఒక ఉపాధ్యక్ష,
ఒక కోఆప్షన్‌సభ్యుని పదవికి నిర్వహణ
నాలుగు ఉపసర్పంచ్ పదవులకు కూడా..
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 25 (ఆంధ్ర్యోతి) : జిల్లాలో ఆకస్మికంగా ఖాళీలు ఏర్పడిన మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు గురువారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకున్నారు. మార్కాపురం, త్రిపురాంతకం మండలాల అధ్యక్ష పదవులతో పుల్లలచెరువు మండలంలో ఉపాధ్యక్ష, ఎర్రగొండపాలెం మండలంలో కోఆప్షన్ సభ్యుడి పదవికి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించారు.
నాలుగు ఉపసర్పంచ్ పదవులకు కూడా..
జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉప సర్పంచ్ పదవులకు కూడా ఈనెల 27న పరోక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా జిల్లాలో ఎనిమిది ఉప సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అయితే నాలుగు పంచాయతీల్లో వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉండటంతో అక్కడ ఎన్నికలను ఈసీ నిలిపివేసింది. కొండపి మండలం పెరిదేపి, కంభం మండలం తురిమెళ్ల, టంగుటూరు మండలం ఆలకూరపాడు, త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో ఉపసర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డుసభ్యుల పదవి ఖాళీగా ఉన్న నాగన్నపాలెం, నాగంపల్లి, బేస్తవారపేట, టంగుటూరు పంచాయతీల ఉప సర్పంచ్ ఎన్నికలను నిలుపుదల చేశారు.