నగరంలో నైట్ స్ట్రీట్‌ఫుడ్ దుకాణాల తనిఖీ
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:43 AM
నగరంలో రోడ్‌సైడ్ ఆహార విక్రయాల దుకాణాలను ఆహార భద్రత అధికారులు శుక్రవారం తనిఖీలు ని ర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల సమీ పంలోని నైట్ ఫుడ్ కోర్టు వద్ద జిల్లా ఆహార భద్రత అధికారి గరికపాటి ప్రభాకర్ రావు తన సిబ్బందితో క లిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఒంగోలు కార్పొరేషన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : నగరంలో రోడ్‌సైడ్ ఆహార విక్రయాల దుకాణాలను ఆహార భద్రత అధికారులు శుక్రవారం తనిఖీలు ని ర్వహించారు. స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాల సమీ పంలోని నైట్ ఫుడ్ కోర్టు వద్ద జిల్లా ఆహార భద్రత అధికారి గరికపాటి ప్రభాకర్ రావు తన సిబ్బందితో క లిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చికెన్ పకోడి దుకాణాలు, తండూరి, గోబీ తయారీ దుకాణాలు, అ లాగే పుచ్చకాయలు, ఫ్రూట్ జ్యూస్ దుకాణాల్లో తనిఖీ లు నిర్వహించి, రంగులు, కెమికల్స్‌తో తయారీ చేసిన ఆహార పదార్థాలు, అలాగే ఎక్కువసార్లు ఉపయోగిం చిన నూనెలను పరిశీలించి, దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభాకర్‌రావు హెచ్చరించా రు. ఈ మేరకు నాణ్యతలేని ఆహారపదార్ధాలు అమ్ము తున్న వ్యాపారులకు అపరాధ రుసుము విధించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారి నరిసింహం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.