Share News

కుమారుడి ఆటోలో వెళ్తూ జారిపడి తల్లి మృతి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:41 PM

ఆటో మలుపు తిప్పుతుండగా అదుపుతప్పి తిరగబడిన ఘటనలో ఆటోకింద మహిళ జారిపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలపరిధిలోని కంచర్లవారిపల్లి వద్ద చోటచేసుకుంది.

కుమారుడి ఆటోలో వెళ్తూ జారిపడి తల్లి మృతి

మరో ఇద్దరికి గాయాలు

కనిగిరి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ఆటో మలుపు తిప్పుతుండగా అదుపుతప్పి తిరగబడిన ఘటనలో ఆటోకింద మహిళ జారిపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలపరిధిలోని కంచర్లవారిపల్లి వద్ద చోటచేసుకుంది. ఎస్‌ఐ టీ శ్రీరాం తెలిపిన వివరాల ప్రకారం.... పట్టణంలోని కాశిరెడ్డికాలనీకి చెందిన ఇండ్లా లక్షమ్మ(50) కూలి పనుల నిమిత్తం తలకొండపాడు గ్రామానికి హైవేపై ఆమె కుమారుడి ఆటోలో వెళ్తున్నారు. కంచర్లవారిపల్లి వద్ద హైవే నుంచి ఆటో మలుపు తిప్పాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి పక్కకు ఒరిగి పడిపోయే క్రమంలో లోపల కూర్చున్న లక్ష్మమ్మ కింద పడిపోగా ఆటో ఆమెపై పడింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయమై రక్తస్రావం కాగా అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న ముగ్గురిలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనాస్థలికి చేరుకుని పూర్వాపరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 21 , 2025 | 11:41 PM

News Hub