విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:12 PM
విద్యాలయాల్లో ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. డీవీజీ శంకరరావు సూచించారు. గురువారం మండల పరిధిలోని వేటపాలెం బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా చిన్నారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఉత్సాహపరిచారు. క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు.

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు
వేటపాలెం(చీరాల), మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : విద్యాలయాల్లో ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. డీవీజీ శంకరరావు సూచించారు. గురువారం మండల పరిధిలోని వేటపాలెం బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా చిన్నారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఉత్సాహపరిచారు. క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు. అంతకుముందు చైర్మన్‌ను తహసీల్దార్ పార్వతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
యానాది సమస్యలపై ప్రత్యేక చొరవ
నిరాధారంగా జీవిస్తున్న ఎస్టీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. శంకరరావు అన్నారు. గురువారం తహసీల్దార్ పార్వతితో ఆయన ప్ర త్యేకంగా మాట్లాడారు. స్థానికంగా నివసిస్తున్న ఎస్టీ (యానాదు)ల వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సం దర్భంగా తహసీల్దార్ పార్వతి ఇప్పటికే మండల పరిధిలో 2200 మంది ఎస్టీలను గుర్తించినట్లు వివరించారు. అలాగే వా రిలో ఆధార్ సమస్యలున్న 694 మందికి పరిష్కరించినట్లు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి జీవన మనుడగపై ప్రత్యేక దృష్టి సారించి పథకాలందేలా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. కార్యక్రమం లో డీటీ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.