పెరిదేపి ఉపసర్పంచ్ పదవి టీడీపీకి..
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:32 AM
మండలంలోని పెరిదేపి గ్రామ ఉపసర్పంచ్‌గా గంటెనపల్లి మాచర్లను పది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా గురువారం గ్రామ సచివాలయం లో ఎన్నుకున్నారు.

ఒప్పందంలో భాగంగా ఎన్నిక
కొండపి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పెరిదేపి గ్రామ ఉపసర్పంచ్‌గా గంటెనపల్లి మాచర్లను పది మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా గురువారం గ్రామ సచివాలయం లో ఎన్నుకున్నారు. గంటెనపల్లి మాచర్ల పేరు ను 6వ వార్డు సభ్యుడు కాలే మల్లికార్జున ప్రతిపాదించగా, 4వ వార్డు మెంబర్ మార్టూరి రా జేష్ బలపరిచారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా చేతులెత్తి మాచర్లకు మద్దతు తెలిపారు. గడచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, వైసీ పీ, మిత్రపక్షాలు కలిసి పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థి గెలిచారు. అపుడు తొలుత రెం డున్నర సంవత్సరాలు వైసీపీకి చెందిన అంగలకుర్తి రవిని సర్పంచ్‌గా, తర్వాత రెండున్నరేళ్లు టీడీపీకి చెందిన గంటెనపల్లి మాచర్లకు సర్పంచ్ పదవి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉపసర్పంచ్‌గా ఉన్న చింతపల్లి ప్రసాద్ ఇటీవల రాజీనా మా చేశారు. దీంతో ఒప్పందం ప్రకారం గంటెనపల్లి మాచర్ల ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నేడోరేపో సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయిం చి, ఉపసర్పంచ్‌ని సర్పంచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది. కాగా ఎన్నికల అధికారిగా ఈవోపీఆర్‌ఆర్డీ అంజలీదేవి వ్యవహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై ప్రేమ్‌కుమార్ బందోబస్తు నిర్వహించా రు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యద ర్శి సునీత, టీడీపీ నాయకులు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, రావిపాటి వెంకటరావు, మార్టూరి వెం కటేశ్వరరావు, వైసీపీ నాయకుడు మోపర్తి నారాయణ పాల్గొన్నారు.