Share News

డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:07 PM

దర్శి ప్రభుత్వ డిగ్రీ క ళాశాల నూతన భవనాల నిర్మాణాలకు నిధులు విడుద ల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చినట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గురువారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ కలిశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌ ప్రాజె క్టులను వివరించారు.

డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి   రూ.17 కోట్లతో ప్రతిపాదనలు
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌

నిధుల మంజూరుకు మంత్రి హామీ

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి వెల్లడి

దర్శి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): దర్శి ప్రభుత్వ డిగ్రీ క ళాశాల నూతన భవనాల నిర్మాణాలకు నిధులు విడుద ల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చినట్టు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గురువారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ కలిశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌ ప్రాజె క్టులను వివరించారు. నాలుగు సంవత్సరాల క్రితం దర్శి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైందని తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని ఒక భవనంలో అరకొర వసతులతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పూర్తిస్థాయిలో వసతులు లేక విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో వి ద్యార్థుల సంఖ్య కూడా ఆశించిన మేరకు పెరగ లేదు. దర్శి-కురిచేడు రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళా శాల కోసం ఆరు ఎకరాల భూమి కేటాయించార న్నారు. అక్కడ భవనాలు నిర్మాణానికి రూ.17 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదనల ప్రతులను మంత్రికి అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి లోకే ష్‌ వీలైనంత త్వరలో నిధులు విడుదల చేస్తానని అంగీకరించినట్లు వారు తెలిపారు.

అలాగే, జాతీయస్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం పునర్నిర్మాణం, అన్నా క్యాంటిన్‌ నిర్వాహణకు నిధులు విడుదల చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుతామని మంత్రి భరోసా ఇ చ్చినట్లు వారు తెలిపారు. అందర్ని కలుపుకొని సమిషి ్టగా ముందుకు పోవాలని మంత్రి లోకేష్‌ సూచించినట్టు డాక్టర్‌ లక్ష్మి పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో అర్హులందరికీ అందేలా కృషిచేయాలని సూచించారని ఆమె తెలిపారు.

Updated Date - Mar 27 , 2025 | 11:07 PM