దైవాలరావూరులో వేగంగా రీ-సర్వే
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:36 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. అందులో భాగంగా కొరిశపాడు మండలంలోని దైవాలరావూరులో రీసర్వేని ప్రారంభించారు. గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించి సర్వే నెంబర్లవారీగా రైతుల సమక్షంలో గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహించారు. ఒక్కొక్క టీంలో వీఆర్వో, సర్వేయర్, వీఆర్‌ఏలు ఉన్నారు. వీరు ఆయా సర్వే నెంబర్లలో గట్ల వారీగా రైతుల పొలాలను గుర్తించి కంప్యూటర్‌లో మార్కింగ్‌ను నమోదు చేసుకున్నారు.

తొలగనున్న గట్టు వివాదాలు
మేదరమెట్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. అందులో భాగంగా కొరిశపాడు మండలంలోని దైవాలరావూరులో రీసర్వేని ప్రారంభించారు. గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించి సర్వే నెంబర్లవారీగా రైతుల సమక్షంలో గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహించారు. ఒక్కొక్క టీంలో వీఆర్వో, సర్వేయర్, వీఆర్‌ఏలు ఉన్నారు. వీరు ఆయా సర్వే నెంబర్లలో గట్ల వారీగా రైతుల పొలాలను గుర్తించి కంప్యూటర్‌లో మార్కింగ్‌ను నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెవెన్యూ రికార్డుల్లో ఆయా సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణం ఉన్నది పరిశీలించి, వారి సాగుబడిలో ఆయా సర్వే నెంబర్లలో ఉన్న విస్తీర్ణాన్ని సరిచూస్తున్నారు. సర్వే నంబర్లో ఉన్న రైతులందరినీ పిలిచి వారి సమక్షంలో ఎక్కువ తక్కువలను సరిచేసి విస్తీర్ణాన్ని నిర్ణయిస్తున్నారు. ఒక్కో టీం రోజుకు 5, 6 సర్వే నంబర్లలోని రైతులకు సమాచారం ఇచ్చి పిలుస్తున్నారు. రైతులు పూర్తిగా హాజరు కాకపోవడం, కొన్ని సర్వే నంబర్లలో విస్తీర్ణం తేడాలు రావడంతో రైతులను కూర్చోబెట్టి వివరించడంతో కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక డీఎల్‌ఆర్ తయారు చేయనున్నారు. అప్పుడు రైతులకు సర్వే నంబర్ల వారీ హద్దు రాళ్లు వేయనున్నారు.
కొంత ఎక్కువ సమయం పట్టినా రైతులను బాగస్వాములను చేసి రికార్డులు తయారు చేయడం వల్ల భవిష్యత్‌లో భూమి సంబంధ విషయాలలో వివాదాలకు తావుండదు. గత ప్రభుత్వం రీసర్వే టీంలకు అధికారులు లక్ష్యాలు నిర్ణయించి ఒత్తిడి చేయడంతో ఎక్కువ తప్పులు దొర్లి రైతులకు సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పుడైనా ఉన్నతాధికారులు రీసర్వే టీంలకు సమయం ఇచ్చి తప్పులు దొర్లకుండా రికార్డులు రూపొందిస్తే భవిష్యత్తులో గట్టు సమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించినట్లే.
హడావుడిగా రీసర్వే చేయద్దు
ఉన్నతాదికారులు హడావుడి చేయడం వలన రీసర్వేలో త ప్పులు దొర్లే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో రీసర్వే హడావుడిగా చేయడం వలన రైతులు ఇప్పటికి కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. ఉన్నతాధికారులు కూడా గ్రామాలకు వచ్చి రీసర్వేలో రైతుల సమస్యలను తెలుసుకోవాలి.
- ముమ్మన నరసింహారావు రైతు
రైతుల సమక్షంలోనే రీసర్వే జరగాలి
రైతుల సమక్షంలో రీసర్వే చేయడం వలన భవిష్యత్‌లో సమస్యలు రావు. అధికారులు పిలిచిన రోజే కొం దరు రైతులు రాలేకపోవచ్చు. సమయమిచ్చి రైతుల వద్ద సమగ్ర సమాచారం, వారి వద్ద ఉన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకోవాలి. రైతులను కూర్చోబెట్టి సమన్వయం చేసి తుది నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇప్పుడు చేసే రీసర్వేతో రైతులు సమస్యలు తొలగిపోవాలి.
- బాచిన బాలకోటయ్య రైతు