ఏప్రిల్ 1 నుంచి సదరమ్ స్లాట్ పునఃప్రారంభం
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:09 PM
జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సదరమ్ స్లాట్ పునఃప్రారంభం కానుంది.

ఒంగోలు కార్పొరేషన్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సదరమ్ స్లాట్ పునఃప్రారంభం కానుంది. ఇన్ని రోజులు దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరమ్ స్లాట్‌లు నిలిపివేయగా, దివ్యాంగ సంఘాలు విజ్ఞప్తుల మేరకు అర్హులైనవారికి సర్టిఫికేట్‌లు అందజేసేందుకు తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.జమున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రులు, జీజీహెచ్‌లలో ప్రతి మంగళవారం సేవలు అమలులోకి వస్తాయని, జిల్లాలో అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.