సూరవరపుపల్లి చెరువుకు సాగర్ జలాలు
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:08 PM
యద్దనపూడి మండలం సూరవరపుపల్లి గ్రామంలోని చెరువుకు దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న వాగు నుంచి సాగర్ జలాలును సోమవారం నింపుతున్నారు. వాస్తవానికి గ్రామంలోని చెరువుకు డైరెక్టగా సాగర్ జలాలు చేరే అవకాశం లేదు. గ్రామ పంచాయతీ వారు చెరువులోని నీటిని సమీపంలోని బావిలోకి పంపింగ్ చేసిన తర్వాత మరల బావి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్ కు నీటిని ఎక్కించి అక్కడ నుంచి గ్రామంలో ఏర్పాటు చేసిన కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తుంటారు.

ఎమ్మెల్యే ఏలూరి సూచనలతో కదిలిన నాయకులు
యద్దనపూడి, (మార్టూరు) మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : యద్దనపూడి మండలం సూరవరపుపల్లి గ్రామంలోని చెరువుకు దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న వాగు నుంచి సాగర్ జలాలును సోమవారం నింపుతున్నారు. వాస్తవానికి గ్రామంలోని చెరువుకు డైరెక్టగా సాగర్ జలాలు చేరే అవకాశం లేదు. గ్రామ పంచాయతీ వారు చెరువులోని నీటిని సమీపంలోని బావిలోకి పంపింగ్ చేసిన తర్వాత మరల బావి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్ కు నీటిని ఎక్కించి అక్కడ నుంచి గ్రామంలో ఏర్పాటు చేసిన కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే గత నెల రోజుల నుంచి చెరువులోని నీరు పూర్తిగా అడుగంటిపోయాయి. దాంతో ఈ వేసవిలో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని టీడీపీ గ్రామ నాయకులు కోయ సతీష్, కోయ శరత్ బాబు, ఇంటూరి వినయ్, వసంతరావు, నాగేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈనేపథ్యంలో గ్రామ సమీపంలోని వాగుకు ప్రస్తుతం విడుదల చేసిన సాగర్ జలాలు చేరుతుండడంపై, వాగు నుంచి నీటిని చెరువుకు పంపించాలని, అందుకు సంబంధించి గ్రామ నాయకులకు సహకరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బ్రహ్మయ్యకు ఏలూరి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి టీడీపీ నాయకులు వాగు నుంచి పైపులు ద్వారా ప్రత్యేకంగా చెరువుకు నీటిని పంపిస్తున్నారు. దాదాపుగా వారం రోజులు వాగు నుంచి చెరువుకు నీటిని పంపిస్తే ఎండాకాలంలో గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ వేసవి కాలంలో మాత్రం గ్రామంలో మంచినీటి సమస్య తీరినట్లేనని గ్రామస్థులు అంటున్నారు.