Share News

29న విశ్వావసు ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:22 AM

విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్‌బాబు తెలి పారు.

29న విశ్వావసు ఉగాది వేడుకలు

ఒంగోలు కల్చరల్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్‌బాబు తెలి పారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం స్థానిక కా ర్పొరేషన్‌ మేయర్‌ గంగాడ సుజాత తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి అత్యంత ప్రధా న మైన ఉగాది వేడుకల్లో భాగంగా స్థానిక కాపు కళ్యాణమండపంలో ఉదయం 9.30 గంటల నుంచి పంచాంగ శ్రవణం, నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నా రు. ఈ సంవత్సరం కుర్రా కోటి సూర్యమ్మ స్మారక సాహిత్య జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కప్పగంతుల మధుసూధన్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. మరికొందరికి ప్రతిభా పురస్కారాలను అందజేయను న్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీవీఎన్‌ రీడింగ్‌ రూం అధ్యక్షుడు గురునా థరావు, నారపుశెట్టి శ్రీనివాసరావు, గిరిజాశాండిల్య, నూనె అంకమ్మరావు, అ నుమల మహేంద్ర కుమార్‌, మద్దులూరి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:22 AM