Rajamahendravaram: గంజాయి కేసులో శిక్ష.. నేరస్తుడు పరారీ..
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:25 AM
రాజమహేంద్రవరం త్రీటౌన్ సీఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గన్నవరం పంచాయతీ నాచవరానికి చెందిన లావేటి తల్లిబాబును గంజాయి కేసులో డీఆర్‌ఐ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.

రాజమహేంద్రిలో బేడీలు వేస్తుండగా కలబడి వేగంగా పరుగు
రాజమహేంద్రవరం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కోర్టు శిక్ష విధించిన ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. రాజమహేంద్రవరం కోర్టు బయటు సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం త్రీటౌన్ సీఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గన్నవరం పంచాయతీ నాచవరానికి చెందిన లావేటి తల్లిబాబును గంజాయి కేసులో డీఆర్‌ఐ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు. సోమవారం అతని నేరం రుజువు కావడంతో కోర్టు పదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. కోర్టులో నిందితుడిని హాజరు పరిచే సమయంలో బేడీలు (హ్యాండ్ కప్స్) వేయకూడదు. దీంతో నేరస్తుడిని బయటికి తీసుకొచ్చి జైలుకు తరలించేందుకు బేడీలు వేస్తున్న క్రమంలో... తమతో కలబడి వేగంగా పారిపోయాడని ఎస్కార్టుగా వచ్చిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్