Share News

Hyderabad: ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా

ABN , Publish Date - Mar 26 , 2025 | 09:56 AM

ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా అంటూ.. ఓ వివాహిత తన తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా

- అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

- తల్లికి ఫోన్‌లో విషయం చెప్పి అఘాయిత్యం

హైదరాబాద్: అత్తింటి వారి వేధింపులు తాళలేక డబీర్‌పుర(Dabbirpura)లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన తల్లికి ఫోన్‌ చేసిన ఆ మహిళ.. ‘అమ్మా ఇక నా వల్ల కాదు, నేను చనిపోతున్నా’ అని చెప్పి ఓ ఫ్లైఓవర్‌(Flyover)పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌(Hyderabad)లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో వివాహిత తహనజర్‌బేగం మరణించింది.

ఈ వార్తను కూడా చదవండి: MLA Raja Singh: మరో సంచలనానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. విషయం ఏంటంటే..


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని కాలడేరా ప్రాంతానికి చెందిన తహనజర్‌ బేగంకు నాగబౌలి ప్రాంతానికి చెందిన మిర్జా మొజాం అలీబేగ్‌ అలియాస్‌ అమీర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, భర్త, అత్త, ఆడపడుచు, తోటి కోడళ్లు తహనజర్‌ బేగంను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. తహనజర్‌బేగం తన సమస్యను తల్లికి పలుమార్లు చెప్పగా ఆమె సర్దిచెబుతూ వస్తోంది.


city4.2.jpg

ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో గొడవ జరగ్గా.. కుటుంబసభ్యుల వేధింపులు భరించలేకపోయిన తహనజర్‌బేగం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఉదయం డబీర్‌పుర ఫ్లైఓవర్‌పైకి వచ్చి తల్లికి ఫోన్‌ చేసి తన నిర్ణయాన్ని వివరించింది. తల్లి వద్దని వారిస్తున్నా వినకుండా ఫోన్‌ కట్‌ చేసి బ్రిడ్జిపై నుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన డబీర్‌పుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2025 | 09:56 AM