Share News

Speaker Ayyanna Patrudu : అసెంబ్లీ 75 రోజులైనా జరగాలి

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:43 AM

ఏడాదిలో 75 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు జరగాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.

Speaker Ayyanna Patrudu : అసెంబ్లీ 75 రోజులైనా జరగాలి

  • అప్పుడే ప్రజా సమస్యలపై లోతైన చర్చ: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజులైనా జరగాల్సిన అవసరం ఉందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. అమరావతిలోని అసెంబ్లీ భవనం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. స్పీకర్‌ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్నేళ్లయునా సమాజంలో పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, అసమానతలు, లింగ వివక్షత, ఉగ్రవాదం, మతతత్వం, మాదక ద్రవ్యాల వాడకం, మహిళలపై హింస వంటి సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకొనేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల పనిదినాలు తగ్గిపోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం బలహీనమౌతున్నట్లు అనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1983లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్‌ సమావేశాలే 45 రోజులపాటు జరిగేవని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలందరికీ శాసనసభ నియమాలు, పద్ధతులపై అవగాహన కల్పించేందుకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వంటి వారిని ఆహ్వానిస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మాదిగ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు ఉండవల్లి శ్రీదేవి, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్నకుమార్‌, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందినప్పుడే సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగుతాయని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:43 AM