gan̄jāyi 22 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:50 PM
gan̄jāyi ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 22 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు.

ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్
పలాస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 22 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లా డుతూ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ఒడిశా రాష్ట్రం ఆర్.ఉదయగిరి తాలూకా టిక్క మాల గ్రామానికి చెందిన ఆమోద్ ఆనంద్‌కు అదే గ్రామానికి చెందిన కబు ఆనంద్‌తో బంధుత్వం ఉంది. కబు ఆనంద్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ముంబైలో విక్రయిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన నిఖిల్‌పాణితో కలిసి ఆమోద్ ఆనంద్ సోమవారం గంజాయిని తరలిస్తుం డగా పలాస రైల్వే స్టేషన్ వద్ద సీఐ పి.సూర్యనారాయణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారన్నారు. అయితే నిఖిల్‌పాణి పరారు కాగా ఆనంద్‌ను అరెస్ట్ చేసి పలాస కోర్టులో హాజరుపరిచామన్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా పెట్టామని, అన్ని మార్గాల్లో సిబ్బంది పహారా ఉన్నారన్నారు. గంజాయి తీసు కున్నా, రవాణా చేసినా తమకు సమాచారం అందించాలని కోరారు. సమా వేశంలో సీఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.