job fair జాబ్‌మేళాను వినియోగించుకోండి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:21 AM
job fair ప్రభుత్వం సీడాప్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న జాబ్‌మేళా లను యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సీడాప్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న జాబ్‌మేళా లను యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.లత, సీడాప్ ప్రతినిధి రమణమూర్తి, హెచ్‌ఆర్‌ఏలు శిరీష, టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.
పార్టీ సభ్యత్వంతో గుర్తింపు
టీడీపీ సభ్యత్వం పొందడం ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం భవానీపురంలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. నేతింటి విశ్వేశ్వరరావు, గొద్దు చిట్టిబాబు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.