Share News

gan̄jāyi 14 కేజీల గంజాయితో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:19 AM

gan̄jāyi విశాఖపట్నం డిప్యూటీ సూపరిం టెండెంట్‌ ఆఫ్‌ రైల్వే పోలీసు రామచంద్రరావు ఆదేశాల మేరకు మంగళ వారం రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ ఎస్‌కె షరీఫ్‌ నేతృత్వంలో పలాస రైల్వే స్టేషన్‌లో మంగళవారం తనిఖీ చేశారు.

gan̄jāyi    14 కేజీల గంజాయితో ముగ్గురి అరెస్టు

పలాసరూరల్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డిప్యూటీ సూపరిం టెండెంట్‌ ఆఫ్‌ రైల్వే పోలీసు రామచంద్రరావు ఆదేశాల మేరకు మంగళ వారం రైల్వే జీఆర్పీ ఎస్‌ఐ ఎస్‌కె షరీఫ్‌ నేతృత్వంలో పలాస రైల్వే స్టేషన్‌లో మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి తరలిస్తూ ముగ్గు రు పట్టుబడ్డారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రా నికి చెందిన త్యాగు, విఘ్నేశ్‌, అజిత్‌ ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి పలా స రైల్వేస్టేషన్‌ మీదుగా తమిళనాడుకు సుమారు రూ.74వేల విలువైన 14.8 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీ చేసి నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. డబ్బు సంపా దించాలనే ఆశతో యువత గంజాయి స్మగ్లింగ్‌ బారిన పడి జీవితాలను నాశ నం చేసుకోవద్దన్నారు. గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రతి రోజు రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు.

ఫొటో: క్రైం

Updated Date - Mar 26 , 2025 | 12:19 AM