people died వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:18 AM
people died జిల్లాలో వేర్వేరు చోట్ల మంగళవారం విద్యుదాఘాతానికి గురైన ఘటన ల్లో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాధం నెలకొంది.

జిల్లాలో వేర్వేరు చోట్ల మంగళవారం విద్యుదాఘాతానికి గురైన ఘటన ల్లో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాధం నెలకొంది.
మోటారు స్విచ్ ఆఫ్ చేస్తుండగా...
శ్రీకాకుళంక్రైం,మార్చి25 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని దేశెల్ల వీధికి చెందిన ఎం.ఆనందరావు(47) జిల్లా పరిషత్ రోడ్‌లో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు నీటి ట్యాంక్‌ను నింపేందుకు కార్యాలయం ఆవ రణలో ఉన్న మోటారు స్విచ్ వేశాడు. ట్యాంక్ నిండిపోవడంతో మోటారు స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. పడి పోయిన శబ్దం రావడంతో తోటి ఉద్యోగులు వెళ్లి చూసేసరికి అచేతనంగా కని పించాడు. అక్కడి సిబ్బంది 108కి సమాచారం అందించడంతో వారు అక్కడ కు చేరుకుని ఆనందరావును పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధా రించారు. ఈ విషయం తెలుసుకున్న ఆనందరావు కుటుంబ సభ్యులు చేరు కుని విలపించారు. ఒన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సంఘటన స్థలానికి చేరు కుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తర లించారు. ఆనందరావు భార్య దుర్గ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేశారు. ఆనందరావుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నిచ్చెన కరెంట్ తీగలకు తగిలించడంతో...
బూర్జ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): చీడివలసలో విద్యుదా ఘాతానికి గురై ఒకరు మృతిచెందాడు. గ్రామ స్థులు, పోలీసుల కథనం మేరకు.. చీడివ లసకు చెంది న బూరి మణికుమార్ (24) నూత నంగా నిర్మించిన ఇంటి గోడలకు తడిపేందుకు ముందుకొ చ్చాడు ఆ సమయంలో ఇనుప నిచ్చెనను కరెంట్ తీగలకు తగి లించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐటీఐ చదువుతున్న మణికుమార్ గ్రామంలో అందరితో సరదాగా ఉండేవాడు. తండ్రి దుర్గారావు, తల్లి కేసరి కుటుంబ సభ్యులు కన్నీ రుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు ఎస్‌ఐ ప్రవళ్లిక కేసు నమోదుచేశారు.
స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం
సంతబొమ్మాళి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సౌదీ అరే బియాలో మృతి చెందిన శెలగపేటకు చెందిన దున్న నారాయణస్వామి (47) మృతదేహం మంగ ళవారం స్వగ్రామానికి చేరుకుంది. కొంతకాలం కిందట జీవనం కోసం ఆయన సౌదీ అరేబియాకి వెళ్లి అక్కడ ఒక ప్రైవే టు కంపెనీలో పనిచేస్తు న్నాడు. అక్కడ అనారోగ్యా నికి గురై ఈనెల 12న మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని దేశానికి రప్పించారు. విశాఖ విమానాశ్రయానికి మృతదేహం రాగా, అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకు వచ్చి అంత్య క్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.