Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:22 AM

మత్స్యకారుల సంక్షమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి
రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడిచిపెడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

హిరమండలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. మంగళ వారం హిరమండలం వంశధార రిజర్వాయర్‌లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా వివిధ రకాల 4,856 లక్షల చేప పిల్లలను విడిచి పెట్టారు. మత్స్యకారుల జీవనోపాధికి చేపపిల్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి పీవీ శ్రీనివాస రావు, ఏడీ వైవీ సత్యనారాయణ, ఎఫ్‌డీవో ఎస్‌ ముసలినాయుడు, టీడీపీ నేతలు యాళ్ల నాగేశ్వరరావు, తూలుగు తిరుపతి రావు, సర్పంచ్‌ లంక రోజారాణి, ఎంపీటీసీ చింతాడ బుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:23 AM