Drinking water పట్టణానికి త్వరితగతిన తాగునీరందించాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:25 AM
Drinking water పలాస-కాశీబుగ్గ మునిసిపా లిటీకి వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని, ఉద్దానం రక్షిత నీటి పథకాన్ని త్వరితగతిన ప్రారంభించి కుళా యిల ద్వారా నీరందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపా లిటీకి వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని, ఉద్దానం రక్షిత నీటి పథకాన్ని త్వరితగతిన ప్రారంభించి కుళా యిల ద్వారా నీరందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేర కు మంగళవారం ఉద్దానం రక్షిత నీటి పథకం డీఈఈ ఆశాలత, మునిసిపల్ కమిషనర్ ఎన్.రామారావు, డీఈఈ కనకరాజు తదిత రులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. శాసనంలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకువెళ్లారు.
జీడి పిక్కలకు మద్దతు ధరకు కృషి
కాశీబుగ్గ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జీడి రైతులు సాగు చేస్తున్న జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించే దిశలో చర్యలు తీసు కుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు. మంగళ వారం స్థానికంగా ఓ కల్యాణ మండపంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడి మామిడి, కొబ్బరి పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు మల్ల శ్రీనివాసరావు, టంకాల రవిశంకర్ గుప్తా, టెక్కలి సంయుక్త ఉద్యాన వన శాఖాధికారి కె.శైలజ, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
పలాసరూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి వారిలో నమ్మకం పెంచా లని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రెంటికోట పీ హెచ్‌సీకి గ్లో సంస్థ అందించిన ఆక్సిజన్ కాన్సట్రేటర్‌ను మంగళవారం ఆమె అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కుత్తుమ లక్ష్మణ కుమార్, పీరికట్ల విఠ ల్, దువ్వాడ సంతోష్, వైద్యులు టి.సునీల్ కుమార్, మౌనిక పాల్గొన్నారు.
విద్యతోనే ఉన్నత సమాజం సాధ్యం
విద్యతోనే ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుం దని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బ్రాహ్మణతర్లా హైస్కూల్‌లో మంగళవారం రూ.60 వేలతో పూణేకు చెందిన వైఫోర్డి ఫౌండేషన్, హిందు స్తాన్ కోకోకోలా బేవరేజెస్, గ్లో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించారు. హెచ్‌ఎం ఎస్‌వీ రమణారావు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్.బాలశంకరం తదితరులు పాల్గొన్నారు.