సారా నిర్మూలనకు సహకరించండి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:32 PM
గ్రామాల్లో సారా నిర్మూలనకు గ్రామస్థులు సహకరించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమి షనర్ శ్రీకాంత్‌రెడ్డి కోరారు.

పలాసరూరల్,మార్చి27(ఆంధ్రజ్యోతి):గ్రామాల్లో సారా నిర్మూలనకు గ్రామస్థులు సహకరించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమి షనర్ శ్రీకాంత్‌రెడ్డి కోరారు.గురువారం మండలం లోని పెదంచలలో సారా నిర్మూలనకోసం చేపడు తున్న నవోదయం-2.0 కార్యక్రమం ఎక్సైజ్ అధికా రుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సారా అమ్మకం, కొనుగోలు, సేవించడం చట్ట రీత్యా నేరమని, ప్రభుత్వం అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తుందని వివరించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ ఎన్.కళ్యాణచక్రవర్తి,ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.మల్లికా ర్జునరావు, సర్పంచ్ వి.రామారావు పాల్గొన్నారు.