ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:08 AM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆది వారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. క్యూలైన్లలో భక్తు లు పెద్ద ఎత్తున వేచి ఉండి స్వామివారిని దర్శించుకు న్నారు.

అరసవల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆది వారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. క్యూలైన్లలో భక్తు లు పెద్ద ఎత్తున వేచి ఉండి స్వామివారిని దర్శించుకు న్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం సేదతీరేందుకు ఆలయం ఎదురుగా పెద్దపెద్ద చలువ పందిళ్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు పందిళ్లలో కూర్చుని ప్రసాదాలు స్వీకరించారు. ఉచిత అన్నప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. ఇంద్ర పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిం చి, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా స్వామివారికి ఆదివారం ఒక్కరోజు రూ.6,91,823 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,73,720 లభించాయి.