సంస్కరణలపై అపోహలు తొలగించండి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:06 AM
విద్యావ్య వస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణ లపై ప్రజలకున్న అపోహాలను తొలగించాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు.

కవిటి, మార్చి25(ఆంధ్రజ్యోతి): విద్యావ్య వస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణ లపై ప్రజలకున్న అపోహాలను తొలగించాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు. మంగళవారం రామయ్య పుట్టుగలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రత్యేకాఽ దికారి పద్మలతతో కలిసి విద్యాశాఖాధికారుల తో సమీక్షించారు. జీవో- 117 ఉపసంహరణతో కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. ఫౌండేషన్, మోడల్ ప్రాఽథమిక పాఠశాలల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి మండల విద్యాశాఖాదికారులు పాల్గొన్నారు.
ఫకంచిలి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన బాలిక పులక నక్షత్ర వైద్యం కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసిన 21, 300 చెక్కును ప్రభుత్వ విప్ అశోక్ అందజేశారు.