సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:09 AM
రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ అధ్యక్షుడు, ఆమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.

శ్రీకాకుళం స్పోర్ట్స్, మార్చి 23 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో సాఫ్ట్‌బాల్ క్రీడాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ అధ్యక్షుడు, ఆమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిం డి నరసింహరాజు అధ్యక్షతన ఆదివారం ఓ ఫంక్షన్ హాల్‌లో 13 జిల్లాల సాఫ్ట్‌బాల్ సంఘం ప్రతి నిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే గణనీయమైన ఆదరణ కలిగి, అత్యద్భుతమైన ఫలితాలు, ప్రగతి సాధిస్తున్న సాఫ్ట్‌బాల్ గేమ్‌ను మున్ముందు మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 13 జిల్లాలకు సాఫ్ట్‌బాల్ స్పోర్ట్స్ కిట్లు, క్రీడా దుస్తులు సమకూర్చేందుకు తగిన ఎస్టిమేట్లు సిద్ధం చేయాలన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల కల్పనపై త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మూడేళ్లలో శ్రీకాకుళంలో నేషనల్ పోటీలు నిర్వహించేందుకు సాధ్యా సాధ్యాలు తెలియజేయాలని సంఘ ప్రతినిధులు ఎంవీ రమణకు సూచించారు. సమావేశంలో జిల్లా చైర్మన్ బి.హరధరరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సీఈవో పి.సుందరరావు, పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీవీ రమణ, గ్రిగ్స్ కార్యదర్శి కె.మాధవరావు, కె.నరసింహారెడి ్డ, ఎస్.సూరిబాబు, 13 జిల్లాల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.