Share News

అసమానతలు తొలగేవరకూ ఉద్యమాలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:52 PM

అసమానత లు ఉన్నంత వరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటా యని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్రనాయకుడు వై.వెంకటేశ్వర్లు అన్నారు.

అసమానతలు తొలగేవరకూ ఉద్యమాలు
పాతపట్నం: భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు

పలాసరూరల్‌,మార్చి23(ఆంధ్రజ్యోతి): అసమానత లు ఉన్నంత వరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటా యని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ రాష్ట్రనాయకుడు వై.వెంకటేశ్వర్లు అన్నారు. మాకన్నపల్లిలో ఆదివారం స్వాతంత్య్ర ఉద్యమకారుడు భగత్‌ సింగ్‌ 94వ వర్ధంతి ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కాగర్‌ పేరుతో ఉద్యమకారులను తీవ్రంగా హింసిస్తోందన్నా రు. కార్యక్రమంలో జిల్లా పౌరహక్కుల సంఘం అధ్య క్షుడు పత్రి దానేసు, పీడీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంక ట్రావు, పీడీఎం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, చింతా డ కృష్ణారావు, తెప్పల అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.
భగత్‌సింగ్‌ ఆశయసాధనకు పాటుపడాలి
నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి):
భగత్‌సింగ్‌ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు అరవింద్‌, నెయ్యల సాంబశివరాజు అన్నారు. స్వాతంత్ర సమ రయోధుడు, విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు శ్యామ్‌, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరులకు ఘన నివాళి
పాతపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
దేశ స్వాతం త్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌, హరిశివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఆదర్శనీయులని వక్తలు అన్నారు. ఆలాంధ్ర రోడ్‌లో ప్రాథమిక పాఠశాల ఆవరణలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పి.రామ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:52 PM