Share News

ఆదిత్యాలయంలో ఆక్టోపస్‌ బృందం మాక్‌డ్రిల్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:04 AM

అరసవల్లిలోని సూర్య నారాయణ స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి ఆక్టోపస్‌ బృందం తీవ్రవాదుల దాడులు జరిగితే చేపట్టాల్సిన ఆన్‌సైట్‌ ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్‌డ్రిల్‌ నిర్వహించింది.

 ఆదిత్యాలయంలో ఆక్టోపస్‌ బృందం మాక్‌డ్రిల్‌
ఆలయంలోకి ప్రవేశిస్తున్న ఆక్టోపస్‌ బృందం సభ్యులు:

అరసవల్లి/క్రైం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని సూర్య నారాయణ స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి ఆక్టోపస్‌ బృందం తీవ్రవాదుల దాడులు జరిగితే చేపట్టాల్సిన ఆన్‌సైట్‌ ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్‌డ్రిల్‌ నిర్వహించింది. ఆదిత్యాలయం లో ఆక్టోపస్‌ ఏఎస్సీ సి.రాజారెడ్డి పర్యవేక్షణలో డీఎస్సీ మధుసూ దన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా నాలుగుబృందం మాక్‌డ్రిల్‌లో పా ల్గొంది. రాత్రి ఎనిమిదిగంటలకు ఆలయం మూసివేసిన తర్వాత పోలీసు, రెవెన్యూ,ట్రాన్స్‌కో, అగ్నిమాపకశాఖతోపాటు వివిధ శాఖల సమన్వయంతో తొమ్మిదిగంటలకు విద్యుత్‌సరఫరా నిలిపివేసి, చీకట్లో ఆలయంలోకి ఆక్టోపస్‌ బృందం ప్రవేశించింది. 30మంది కమాండోలు ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు తీవ్రవాదుల (డమ్మీ)ను అదుపులోకి తీసుకోవడం లేదా మట్టుబెట్టడం ద్వారా వారి చేతుల్లో బందీగాఉన్న ఈవో(డమ్మీ)ను సురక్షితంగా విడిపిం చడం, తీవ్రవాదుల చెరనుంచి ఆలయానికి రక్షణ కల్పించేదిశగా మాక్‌డ్రిల్‌ చేపట్టారు.2018లో అరవసల్లి ఆలయంలో ఆక్టోపస్‌ ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న మాక్‌డ్రిల్‌ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:04 AM