Share News

ఉద్యోగులకూ సూర్యఘర్‌ సబ్సిడీ: ఎల్‌డీఎం

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:49 PM

ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంకింద ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సబ్సిడీ వర్తిస్తుందని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సూర్యకిరణ్‌ తెలిపారు.

 ఉద్యోగులకూ సూర్యఘర్‌ సబ్సిడీ: ఎల్‌డీఎం
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎల్‌డీఎం సూర్యకిరణ్‌

నరసన్నపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంకింద ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సబ్సిడీ వర్తిస్తుందని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సూర్యకిరణ్‌ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో జాయింట్‌ మండల లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌ పథకానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో డీడీఎం రమేష్‌ కృష్ణ, డీపీఎం జి.నారాయణరావు, ఏసీలు శ్రీరాములు, కొండలరావు, వైకుంఠరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:49 PM