Share News

7 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:39 PM

పలాస రైల్వే స్టేషన్‌ వద్ద ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరికి చెందిన గుల్సన్‌ ఆనంద్‌, మోజేష్‌కుమార్‌పాణి 7.8 కిలోల గంజాయి తరలి స్తుండగా శనివారం సీఐ పి.సూర్యనారాయణ సిబ్బందితో తనిఖీ చేసి పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు.

7 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటఅప్పారావు

పలాస, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పలాస రైల్వే స్టేషన్‌ వద్ద ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరికి చెందిన గుల్సన్‌ ఆనంద్‌, మోజేష్‌కుమార్‌పాణి 7.8 కిలోల గంజాయి తరలి స్తుండగా శనివారం సీఐ పి.సూర్యనారాయణ సిబ్బందితో తనిఖీ చేసి పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఆ మేరకు.. గుల్సన్‌ఆనంద్‌, మోజేష్‌ ఇద్దరూ స్నేహితులు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నారు. ఏదోవిధంగా డబ్బులు సంపాదించి బెట్టింగ్‌లో కోల్పోయిన నగదు రికవరీ చేసుకోవాలనే ఆలోచనతో గంజాయి రవాణాను ఎంచుకున్నారు. ఒడిశాకి చెందిన బాయ్‌కుంట అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను గంజాయిని చెన్నై, బెంగుళూరుకు తరలిస్తానని, తనకు సాయం చేస్తే నగదు ఇస్తామన డంతో వీరిద్దరూ అంగీకరించారు. 7.8 కిలోల గంజాయిని పలాస రైల్వే స్టేషన్‌ వద్ద శక్తి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డా రు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 11:39 PM