Share News

Unidentified body వంశధార నదిలో గుర్తుతెలియని మృతదేహం

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:15 AM

Unidentified body కళింగ పట్నం పంచాయతీ శిలగాం గ్రామ పరిధిలో వంశధార నదిలో శుక్రవారం గుర్తుతెలి యని మృతదేహం ఉన్నట్టు స్థాని క వీఆర్వో జి.సింహాద్రి గార పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Unidentified body  వంశధార నదిలో గుర్తుతెలియని మృతదేహం

గార, మార్చి 21 (ఆంధ్ర జ్యోతి): కళింగ పట్నం పంచాయతీ శిలగాం గ్రామ పరిధిలో వంశధార నదిలో శుక్రవారం గుర్తుతెలి యని మృతదేహం ఉన్నట్టు స్థాని క వీఆర్వో జి.సింహాద్రి గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌ ఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయ సు ఉంటుందని, పురుషుడుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఆరు లీటర్ల సారాతో ఇద్దరి అరెస్టు

పలాస/పలాస రూరల్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పెంటిభద్ర, శాసనం గ్రామాల్లో సారా అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో శుక్రవారం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆరు లీటర్ల సారా స్వాధీనం చేసుకు న్నట్లు కాశీబుగ్గ ఎక్సైజ్‌ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపారు. పెంటిభద్రలో సవర రాజ్‌కుమార్‌, శాసనంలో కుప్పిలి నారాయణ చెరో 3 లీటర్ల చొప్పున సారా విక్రయిస్తూ పట్టుబడ్డారన్నారు. నిందితులను పలాస కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ షేక్‌ సైదా, పోలీసులు పాల్గొన్నారు.

20 సీసాల ఒడిశా మద్యం పట్టివేత

కవిటి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రాకు తరలిస్తున్న 20 బీరు సీసాలతో ఒకరిని పట్టుకున్నట్టు ఇచ్ఛాపురం ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.దుర్గాప్రసాద్‌ తెలిపారు. శుక్ర వారం కొజ్జిరియా వద్ద తనిఖీలు చేస్తుండగా ఎం.విజయ్‌ అనే వ్యక్తి ఒడిశా మద్యంతో కారులో వస్తూ పట్టుబ డ్డాడన్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐ వి.రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆటో బోల్తా: ముగ్గురికి గాయాలు

కంచిలి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పురుషోత్తపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి గాయాల య్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కంచిలికి చెందిన జగన్నాథం రాజు ఎలియాస్‌ రామకృష్ణ సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో పబ్లిసిటీ కోసం గోడలపై ఫోన్‌ నెంబర్లు రాసేందుకు మరో ఇద్దరితో కలిసి శుక్రవారం ఉదయం ఆటోలో వెళ్లాడు. కొన్ని గ్రామాల్లో పనిపూర్తి చేసి పలాస వైపు వెళ్తుండగా కుక్కలు అడ్డంగా రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో జగన్నాథంరాజుతోపాటు గేదెల దేవరాజు, జంగాల జగన్నాథం గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.

లారీ చోరీ.. ఒడిశాలో స్వాధీనం

ఇచ్ఛాపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధి ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో గురువారం రాత్రి పార్కింగ్‌లో ఉన్న ఓ లారీని ఆగంతకులు దొంగలించుకుపోయారు. ఈ విషయం గుర్తించిన లారీ యజమాని వాసు శుక్రవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలను వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఒడిశా రాష్ట్రం పితాతోళి గ్రామంలో లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 12:16 AM

News Hub